అమిత్ షాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

-

భాజపా జాతీయ అధ్యక్షుడు  అమిత్ షా కు మంత్రి కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. రోజుకో రంగుల కలకంటున్న అమిత్ షా తెలంగాణలో ఉన్న ఆ ఐదు స్థానాలను మీరు కాపాడుకుంటే చాలు.. ఆయన అమిత్ షా కాదు..భ్రమిత్ షా అంటూ ఎద్దేవా చేశారు. నగరంలో ఒక్క కార్పొరేటర్ ని గెలిపించుకునే సత్తాని భాజపా నేతలు స్థాయికి మించిన మాటలు మాట్లాడుతున్నారు అంటూ వారి పై మండిపడ్డారు.  2002లో గుజరాత్ లో మోదీ ముందస్తుకు వెళ్లలేదా? 2004 కు ముందు వాజ్ పేయి ముందస్తుకు వెళ్లలేదా? మీరు చేస్తే ఒప్పు..మేం చేస్తే తప్పా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా అంటే… భారతీయ జూటా పార్టీ అంటూ కొత్త భాష్యం చెప్పారు.

భాజపా కేంద్రంలోకి వచ్చిన తర్వాత అచ్చేదిన్ వస్తది అని నమ్మించారు… కానీ చచ్చేదిన్ వచ్చింది.. బ్యాంకులకు సొమ్ము ఎగవేతదారులని ప్రోత్సహించిన మీరు తెరాస గురించి మాట్లాడటం విడ్డూరం అన్నారు.  తెరాస కు ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ తో నే ఉంటుందని పార్టీ శ్రేణులకు వివరించారు. భాజపా తాటాకు చప్పుళ్లకు తెరాస భయపడదు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news