అరుదైన గౌరవం దక్కించుకున్న ప్రముఖ గాయనీ మంగ్లీ

-

ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ మంగ్లీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. మంగ్లీ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి ఓ జోష్ వస్తుంది. మొదట్లో యూట్యూబ్ ఛానల్ లో భక్తి సాంగ్స్, జానపద పాటలు పాడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. – మంగ్లీ అప్పట్లో పాడిన ‘రేలారే రేలారే, లైరే లాలైరే’ సాంగ్స్ వింటే ఇప్పటికీ జనాల్లో రోమాలు లేస్తాయి. ఈ విధంగా ఫేమస్ అయిన మంగ్లీ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది.

‘శైలజా రెడ్డి అల్లుడు (శైలజా రెడ్డి అల్లుడు చూడండి), జార్జి రెడ్డి ( వాడు నడిపే బండి), అలా వైకుంఠపురంలో (రాములో రాములా), సీటీమార్ (జ్వాలా రెడ్డి), రంగ్ దే (ఊరంతా). లవ్ స్టోరీ (సారంగ దరియా), బలగం (మా ఊరు పల్లెటూరు), భోళా శంకర్ (జం జం జజ్జనక), జవాన్ (జిందా బందా) వంటి మరెన్నో చిత్రాల్లో పాడి తన గానంతో ప్రేక్షకులందర్ని కట్టిపడేసింది. మంగ్లీ పాడిన సాంగ్స్ టాలీవుడ్ ను ఓ ఊపు ఊపడంతో హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

జానపద పాటలతో గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. రీసెంట్ గా స్వధా ఫౌండేషన్ నిర్వహించిన ‘మార్గా 2024’ ఈవెంట్ లో ఉషా ఉతుప్, సుధా రఘునాథన్ వంటి గాయకులతో కలిసి ఈ స్టార్ గాయని వేదిక పంచుకుంది. ఈ క్రమంలో సంగీత ప్రపంచంలో మంగ్లీ అందుకున్న విజయాలకు గానూ సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్’ యువ పురస్కారానికి ఈమె సెలెక్ట్ అయ్యింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అభిమానులు మరిగీకి శుభాకాంక్షలు చెబుతూ.. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మరెన్నో అవార్డులు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news