అర్జున అవార్డు వచ్చిందంటేనే వాళ్లు తోపులన్నమాట. భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వారన్నమాట. మరి.. అటువంటి వాళ్లు ఎలా ఉండాలి. కానీ.. ఈయన చూడండి.. ఎలా ఉన్నాడో. పైన మీరు చూస్తున్న ఫోటో ఆయనదే. ఆయన పేరు దినేశ్ కుమార్. ఊరు హర్యానాలోని భివాని. బాక్సింగ్‌లో అర్జున అవార్డు గ్రహిత. అంతర్జాతీయ బాక్సర్. కానీ.. అవన్నీ గతం. ప్రస్తుతం ఆయన బతకడం కోసం ఐస్ క్రీములు అమ్ముకోవాల్సిన దుస్థితి. ఎందుకు ఐస్ క్రీమ్స్ అమ్ముకుంటున్నావు అని అడిగితే.. ఏం చేయాలి తీసుకున్న లోన్లు తీర్పుకోవాలి కదా.. అంటాడు. లోన్లేమిటి.. అనే డౌట్ మీకు రావచ్చు. అవును..
అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లు ఆడటం కోసం దినేశ్ కుమార్ లోన్లు తీసుకున్నాడు. తన తండ్రి లోన్లు తీసుకొని ఆ డబ్బులతో దినేశ్‌ను టోర్నమెంట్లకు పంపించేవాడట. ఇప్పుడు తీసుకున్న లోన్లు తీర్చాలి కదా. అందుకే ఏ పని లేక ఐస్ క్రీములు అమ్ముతున్నాడట. ఆయన్ను గత ప్రభుత్వాలు కానీ.. ప్రస్తుత ప్రభుత్వం గానీ ఏనాడూ ఆదుకోలేదట. కనీసం ఇప్పుడైనా తనని గుర్తించి.. ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు దినేశ్. ఇప్పటి వరకు 17 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్, 5 బ్రోంజ్ మెడల్స్‌ను దినేశ్ సాధించాడు.