ఇంగ్లాండ్ పై మ్యాచ్ లో పట్టు బిగించిన భారత్….

-

ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత్ మహిళల జట్టువిజయం దిశగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో రాణించిన ఇండియా బౌలింగ్ లోను అదే రీతిలో రాణించి ఇంగ్లాండ్ టీం పై భారీ ఆధిక్యత సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో 428 పరుగులు చేసిన ఇండియా, ఇంగ్లాండ్ టీం ని 136 పరుగులకి కట్టడి చేసింది. దీప్తి శర్మ దెబ్బకు ఇంగ్లాండ్ కుప్పకూలిపోయింది. తాను వేసిన 5.3 ఓవర్లలో కేవలం ఏడు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లను తీసింది. అలాగే బ్యాటింగ్ లో 67 పరుగులు చేసింది.రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 186 పరుగులని చేసింది. పూజ 17 పరుగులతో హార్మన్ ప్రీత్ సింగ్ 40 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.
ప్రస్తుతం ఇండియా 478 పరుగుల లీడులో ఉంది.

ఇంగ్లాండ్ బౌలర్లలో డీన్ రెండు వికెట్లు తీయగా సోపి నాలుగు వికెట్లు తీసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ ఉమెనులలో నాట్ స్కివర్ బంటు తప్ప మిగతా ఎవరు సరిగా రాణించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news