ధోని పై ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారికి 15 రోజుల జైలు శిక్ష…

-

2013 వ సంవత్సరంలో భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఫిక్సింగ్ మరియు బెట్టింగ్ కు పాల్పడినట్లు ఒక ఐపీఎస్ అధికారి ఆరోపణలు చేశాడు. ఐపీఎల్ లో సిఎస్ కే రెండేళ్ల నిషాదాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. సంపత్ కుమార్ అనే ఐపీఎస్ అధికారి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని హైకోర్టును ధోని ఆశ్రయించాడు. ఓ టీవీ ఛానల్ లో పాల్గొన్న సంపత్ కుమార్ తనపై ఆరోపణలు చేశాడని సదరు టీవీ ఛానల్ తో పాటు ఐపీఎస్ అధికారిపై 100 కోట్ల పరువు నష్టం దాఖలు వేశాడు. అంతేకాకుండా తాను అడిగే 17 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు.

ఎంఎస్ ధోని పై పరువు నష్టం దావా కేసులో ముందుగా ఆ ఐపీఎస్ అధికారికి 15 రోజులు శిక్షణ విధించగా అతడు హైకోర్టుకు అప్పీల్ చేయడంతో శిక్షను 30 రోజులపాటు సస్పెండ్ చేసింది. జస్టిస్ మోహన్ మరియు సుందర్ తో కూడిన ధర్మాసనం ఈలోపు కౌంటర్ దాఖలు చేయాలని తీర్పు ఇచ్చింది. అలాగే ధోని లాంటి క్రికెటర్ పై ఏవైనా ఆరోపణలు వస్తే అవి నిజమో కాదో తెలుసుకోవాలని సదర్ చానల్ కి మొట్టికాయలు వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news