ఇందూరు నుంచి తెరాస ఎన్నికల శంఖారావం

-

మహాకూటమిపై ధ్వజమెత్తనున్న సీఎం కేసీఆర్

 

తెరాస ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఇందూరు వేదికగా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అనైతికంగా పొత్తుపెట్టుకున్న మహాకూటమే లక్ష్యంగా విపక్షాలపై ధ్వజమెత్తనున్నారు. గత 7వ తేదీన హుస్నాబాద్‌లో తొలి బహిరంగ సభను నిర్వహించిన కేసీఆర్‌ మళ్లీ 25 రోజుల తర్వాత సభలో పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో 9 శాసనసభ, రెండు ఎంపీ స్థానాలను గెలిచి, పార్టీని అగ్రభాగంలో నిలిపిన  ఇందూరుపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా తెరాసకు కంచుకోటలాంటిదని, రెండో ఎన్నికల సభను అక్కడే నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే సభ నిర్వాహణ బాధ్యతను ఇప్పటికే మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితకు అప్పగించారు.

గిరిరాజ్‌ కళాశాల మైదానం వద్ద 20 ఎకరాల స్థలంలో సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. సభావేదికపై మొత్తం  80 మంది కూర్చునేలా వేదికను రూపొందించారు. అసమ్మతి వర్గాలను ఇప్పటికే బుజ్జగించిన కేసీఆర్ నేటి సభతో అందరిని ఒకేతాటిపైకి తేనున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 30 వేల మంది కార్యకర్తలు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. దీంతో నేటి నుంచి రాష్ట్రంలో ముందస్తు ప్రచారం మరింత హీటెక్కనుంది.

Read more RELATED
Recommended to you

Latest news