వాట్సప్ విపరీతంగా వాడే వాళ్లకే అందులో ఏం లోటుపాట్లు ఉన్నాయి..ఇంకా ఏం ఫీచర్స్ పెడితే బాగుంటుంది అనేది బాగా తెలుసు..మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా..ఫార్వాడ్ చేసే మెసేజ్‌కు ఏదైనా క్యాప్షన్ రాస్తే బాగుండు అని..మనం ఏదైనా మెసేజ్ ఫార్వాడ్ చేస్తుంటే..అది డైరెక్టుగా ఆ వ్యక్తికి వెళ్లిపోతుంది. మళ్లీ ఆ మెసేజ్‌కు ఏమైనా సమచారం జోడించాలంటే..మనం అది కాపీ చేసి రిప్లై ఇస్తుంటాం.. ఇక ఈ సమస్య అక్కర్లా..వాట్సప్ ఫార్వాడ్స్‌కు క్యాప్షన్స్ ఇచ్చే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలో ఉంది. కొద్ది మంది బీటా టెస్టర్స్‌కు అందుబాటులో ఉంది. త్వరలోనే బీటా వర్షన్‌గా రానుంది
షేర్ చేసిన స్క్రీన్ షాట్ల ప్రకారం యూజర్లు ఒక వీడియో గానీ, ఫోటో గానీ ఫార్వార్డ్ చేసినప్పుడు కొత్త ఇంటర్‌ఫేస్ ప్రత్యక్షమై సదరు ఫార్వార్డ్ కంటెంట్‌కు క్యాప్షన్ ఇస్తారా? అని అడుగుతుంది. మల్టీమీడియా కంటెంట్‌కు క్యాప్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇంటర్‌ఫేస్ ప్రత్యక్షమై యూజర్లను అడుగుతుంది. ఆ క్యాప్షన్ తొలగించేందుకు కూడా యూజర్లను అనుమతిస్తుంది. దిగువన ఉన్న డిస్మిస్ బటన్ నొక్కడం ద్వారా క్యాప్షన్ తీసేయొచ్చు..
వాట్సాప్ ఇటీవలే కొత్తగా కాల్ లింక్ ఫీచర్‌ను కూడా ప్రారంభించింది. యూజర్లు ఒక వీడియో లేదా ఆడియో కాల్ లింక్ తయారు చేసి ఇతరులతో పంచుకునేందుకు అనుమతిస్తుంది. ఎలా అయితే గూగుల్ మీట్ లింక్ ఉంటుందో అలా. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ విండోస్ యూజర్లకు మరో ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెస్తోంది. వాయిస్ నోట్స్‌ను స్పీడప్ చేసేందుకు విండోస్ బీటా యూజర్స్‌కు అనుమతిస్తుంది. విండోస్ బీటా యూజర్లు ఆ ఆడియో మెసేజ్‌ను 1.5 లేదా 2 రెట్ల వేగంతో వినవచ్చట. ఈ ఫీచర్ ప్రస్తుతం మీ వాట్సాప్‌లో అందుబాటులో ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. ఒక వాయిస్ నోట్‌ను ప్లే చేసి చూస్తే అందులో వేగానికి సంబంధించి కంట్రోల్స్ కనిపిస్తాయి. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆధారిత మొబైల్ యూజర్లకు అందుబాటులో ఉంది.