అమరావతి రైతుల పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్

-

పాదయాత్రను తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు అమరావతి రైతులు ప్రకటించారు. హైకోర్టు ఆదేశాల మేరకు యాత్రలో పాల్గొన్న వారు.. గుర్తింపు కార్డులు ధరించి యాత్ర చేసుకోవాలని పోలీసులు సూచించారు. అయితే గుర్తింపు కార్డులు చూపించని నేపథ్యంలో యాత్ర నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే యాత్రకి నాలుగు రోజులపాటు తాత్కాలిక విరామం ఇవ్వాలని నిర్ణయానికి రైతులు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక అమరావతి పాదయాత్ర విషయంలో ఏపీ హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో కేవలం 600 మంది మాత్రమే ఉండాలని, డీజీపీకి అందజేసిన జాబితాలో ఉన్న వ్యక్తులు మాత్రమే పాల్గొనాలని స్పష్టం చేసింది. అయితే పాదయాత్రకు సంఘీభావం తెలపాలి అనుకునే వ్యక్తులు ఇరువైపులా ఉండి మద్దతు తెలుపవచ్చు అని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు యాత్రలో పాల్గొనడానికి వీల్లేదని ఆదేశించింది. అయితే పోలీసుల తీరుపై కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు రైతులు.

కోనసీమ జిల్లా రామచంద్రాపురం నుంచి విజయరాయుడుపాలెం వరకు ఈరోజు యాత్ర సాగాల్సి ఉండగా.. ఐడి కార్డులు చూపితేనే యాత్రకు అనుమతి ఇస్తామని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కోర్టుకు వెళ్లాలని రైతులు నిర్ణయించారు. కానీ కోర్టుకు వరుసగా నాలుగు రోజులపాటు సెలవు ఉండడంతో ఈ యాత్ర సుమారు నాలుగు రోజుల వరకు నిలిచిపోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news