ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు కంపెనీ ఆఫర్…మూన్‌లైటింగ్‌ వద్దు..గిగ్‌ జాబ్స్‌ చేసుకోవచ్చు..

-

ఈ మధ్యనే మూన్‌లైటింగ్ వివాదం తెరపైకి వచ్చి ఆగం ఆగం చేసింది. విప్రో అయితే ఏకంగా 300 మంది ఉద్యోగులను తీసేసింది.. ఇన్ఫోసిస్‌ కూడా ఈ విషయంపై బానే సీరియస్‌ అయింది.. అయితే మళ్లీ ఏమనుకుందో ఏమో..కాస్త వెనక్కు తగ్గింది. మూన్‌లైటింగ్‌ వద్దు గిగ్‌ జాబ్స్‌ చేసుకోవచ్చని ఉద్యోగులకు ఆఫర్‌ ఇచ్చింది. గిగ్‌ జాబ్‌ అంటే ఏంటి..?
తమ సంస్థలో ఉద్యోగం చేసేవారు, అదే సమయంలో, తమకు తెలియకుండా, మరో ఉద్యోగం చేయడంపై ఇన్ఫోసిస్ సంస్థ ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలా మూన్ లైటింగ్ చేసే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కూడా హెచ్చరించింది. తాజాగా, ఈ విషయంపై తమ ఉద్యోగులకు సంస్థ హెచ్ ఆర్ విభాగం మెయిల్ చేసింది. ఉద్యోగులు, కావాలనుకుంటే, ‘gig jobs’ చేసుకోవచ్చని, అయితే, అందుకు కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుందని ఆ మెయిల్‌లో పేర్కొంది. ‘gig jobs’ చేయాలనుకునే వారు ముందుగా సంస్థ అనుమతి తీసుకోవాలని, చేసే జాబ్ వివరాలు తెలియజేయాల్సి ఉంటుందని, అలాగే, ఇన్ఫోసిస్ జాబ్ టైమింగ్స్ కాకుండా, మిగతా సమయాల్లోనే ఈ జాబ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంటే పార్ట్‌ టైమ్‌ జాబ్‌ అన్నట్లు..
‘gig jobs’ అంటే..
ప్రధాన ఉద్యోగంతో పాటు చేసే పార్ట్ టైమ్ జాబ్, జాబ్ కాంట్రాక్ట్ లేదా ఆసక్తి ఉన్న రంగంలో చేసే చిన్న ఉద్యోగాలను ‘gig jobs’ లేదా ‘gig works’ అంటారు. ఈ కేటగిరీలోకి పార్ట్ టైమ్ డ్రైవింగ్, పెయింటింగ్, కోచింగ్, ట్యూటరింగ్, ఫిట్ నెస్ ట్రైనింగ్, ఫ్రీలాన్స్ వర్క్.. ఇలాంటివి అన్నీ వస్తాయి.
పోటీ సంస్థలతో వద్దు..
అలాగే, మరికొన్నిషరతులను తమ ఇంటర్నల్ కమ్యూనికేషన్‌లో ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు విధించింది. ఇన్ఫోసిస్, లేదా ఇన్ఫోసిస్ క్లయింట్ల పోటీ సంస్థల వద్ద ఈ గిగ్ జాబ్స్ చేయకూడదని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, ఈ గిగ్ జాబ్స్ వల్ల ఇన్ఫోసిస్‌లో చేసే ప్రధాన ఉద్యోగ విధులపై ప్రభావం పడకూడదని పేర్కొంది. అయితే, ఈ గిగ్ జాబ్స్ పరిధిలోకి ఏ జాబ్స్ వస్తాయో ఇన్ఫోసిస్ ఇంకా స్పష్టంగా పేర్కొనలేదు. మూన్ లైటింగ్ అనే పదాన్ని కూడా సంస్థ ఈ మెయిల్‌లో వాడలేదు.
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో చాలామంది రెండోచేత్తో సంపాదించేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.. అయితే ఎప్పుడైనా సెకండ్‌ జాబ్‌ అనేది ప్రజర్‌ లేకుండా వర్క్‌కు ఇబ్బంది లేకుండా ఫ్రీ టేంలో చేయగలిగేదిలా ఉండాలి. కచ్చితంగా ఈటైమ్‌కు స్టాట్‌ చేయాలి, ఈ టైమ్‌ వరకు చేయాలి అంటే అది మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. దాంతో అటు ఉన్న జాబ్‌, ఇటు తెచ్చుకున్న జాబ్‌ రెండు సరిగ్గా చేయలేక ఇబ్బంది పడతారు.

Read more RELATED
Recommended to you

Latest news