సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. నేను పెద్ద రైతునని చెప్పుకునే KCR మొద్దు నిద్ర పోతున్నాడు అంటూ షర్మిల అన్నారు. 2 నెలలుగా ధాన్యం కల్లాల్లో పెట్టుకొని
రైతులు కన్నీళ్లు పెడుతున్నా దొరకు కనిపించడం లేదని మండి పడ్డారు. వడ్లు కొనకుండా ఇక్కడ ధర్నాలు, ఢిల్లీలో డ్రామాలు చేయడంతో మరో రైతు గుండె ఆగిపోయిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యా కేసీఆర్ ఇంకెంత మంది చస్తే వడ్లు కొంటారు..? అంటూ షర్మిల ప్రశ్నించారు.
ఇంకెంతమంది రైతుల ఉసురు తీస్తే మీ కండ్లు చల్లబడుతాయి?..కల్లాల్లో ఉన్న రైతును కాటికి పంపుతున్నవ్? అంటూ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. యాసంగి పంటలతో బిజీగా ఉండాల్సిన రైతును పాడె ఎక్కిస్తున్నవ్ అంటూ కేసీఆర్ పై షర్మిల నిప్పులు చెరిగారు. వడ్లు కొనమని కాళ్ళు మొక్కించుకుంటున్నావ్…మీది రైతు ప్రభుత్వం కాదు, రైతును కాల్చుకు తింటున్న రైతు పాలిట రాబంధు ప్రభుత్వం అంటూ షర్మిల మండి పడ్డారు.