Jagan couple to London today: వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ లండన్‌కు పయనం కానున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒకరి లండన్ వెళ్లడం లేదు. జగన్మోహన్ రెడ్డి దంపతులు ఇద్దరూ… అంటే జగన్‌తోపాటు వైయస్ భారతి కూడా లండన్ పయనం కాబోతున్నారు.
ఇవాళ ఉదయం బెంగళూరు నుంచి నేరుగా లండన్ ఫ్లైట్ ఎక్కబోతున్నారు వైయస్ జగన్ దంపతులు. సంక్రాంతి పండుగ రోజున గతంలో ఏపీలో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు… ఈసారి మాత్రం లండన్ వెళ్తున్నారు. ఈ నెల 16వ తేదీన జగన్మోహన్ రెడ్డి కుమార్తె వర్ష కాన్వకేషన్ కార్యక్రమం ఉంది. ఈ తరుణంలోనే లండన్ వెళ్తున్నారు. ఇక జనవరి చివరి వారంలో… జగన్ దంపతులు తిరిగి ఏపీకి రాబోతున్నారు.