ఈ ఆవులు మీ దగ్గర ఉంటే.. నెలకు రూ. లక్షల్లో ఆదాయం..!!

-

మన చిన్నప్పుడు చదువుకోకపోతే.. బర్రెలు, గాడిదలు కాసుకోవాల్సి వస్తుంది అనేవాళ్లు.. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్లు కూడా లక్షల్లో జీతాలు వచ్చే జాబ్‌ వదిలేసి గాడిదలు, బర్రెలను తెచ్చుకోని సొంతుళ్లేనే మంచి వ్యాపారం చేసుకుంటున్నారు. ఈరోజుల్లో పాడిపరిశ్రమకు ఎంత గిరాకీ ఉందో మనకు బాగా తెలుసు.. మంచి ప్లేస్‌ ఉండి, ఇద్దరు ముగ్గురు పని వాళ్లను పెట్టుకుంటే.. మన దగ్గర ఉన్న డబ్బును బట్టి గేదలు కొనుగోలు చేసి పాలు మార్కెట్‌లో విక్రయించవచ్చు. అయితే మన దగ్గర ఉండే ఆవులు, గేదలు కాకుండా.. ఇప్పుడు చెప్పుకోబోయేవి కనుక మీరు కొనుగోలు చేశారంటే.. మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలే..!

గిర్‌ ఆవులు..

కొన్ని రకాల ఆవులు రోజుకు 50 లీటర్ల పాలిస్తాయి. వాటి పెంపకం ద్వారా రైతులు ప్రతి నెలా లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు. మన దేశంలో అత్యధిక పాలిచ్చే ఆవు జాతిగా గిర్ ఆవులకు మంచి పేరుంది. వీటి పొదుగు చాలా పెద్దగా ఉంటుంది. గుజరాత్‌లోని గిర్ అడవుల్లో ఎక్కువగా కనిపించే ఈ ఆవులను ప్రస్తుతం దేశమంతటా ఉన్నాయి.. బ్రెజిల్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో కూడా గిర్ ఆవులను పెంచుతారు. ఇవి సగటున రోజుకు 12 నుంచి 20 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. మంచి పోషకాహరం ఇస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకుంటే.. 50 లీటర్ల వరకు పాలిస్తాయి. నెలవారీగా 1500-1800 లీటర్ల వరకు పాలు ఇస్తాయి.

లాల్ సింధీ ఆవు:

ఎక్కువ ఆదాయం పొందాలనుకునే రైతులకు లాల్‌సింధీ ఆవులు మంచి ఎంపిక.. ఈ ఆవు సింధ్ ప్రాంతానికి చెందినది. అందువల్ల వీటిని లాల్ సింధీ ఆవులు అని పిలుస్తారు. ప్రస్తుతం పంజాబ్, హర్యానా, కర్నాటక, తమిళనాడు , కేరళ , ఒడిశా రాష్ట్రాలకు చెందిన రైతులు ఎక్కువగా ఈ ఆవులను పెంచుతున్నారు. పాల ఉత్పత్తి సామర్థ్యంలో గిర్ ఆవులకు ఏ మాత్రం ఇవి తీసిపోవు. సగటున 12 నుంచి 20 లీటర్ల వరకు పాలు ఇస్తాయి.

సాహివాల్ ఆవు:

సాహివాల్ జాతికి చెందిన ఆవులను హర్యానా; ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా పెంచుతున్నారు. ఇవి ప్రతి రోజు 10-20 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. మంచి సంరక్షణతో నెలకు 40 లీటర్ల వరకు పాలను ఉత్పత్తి చేయవచ్చు. చాలా మంది రైతులు, డైరీ నిర్వాహులకు ఎంతో ఇష్టమైన ఆవు ఇది.
ఈ మూడు జాతులకు చెందిన ఆవులను ఒక్కొక్కటి పెంచుకున్నా.. ప్రతి నెలా రూ.5 వేల లీటర్ల వరకు పాలను ఉత్తత్తి చేస్తాయి.. లీటర్‌కు రూ.60 వేలు అనుకున్నా…. నెలకు రూ.3 లక్షల ఆదాయం వస్తుంది. ఇందులో ఖర్చులన్నీ పోయినా.. రూ. లక్షా 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఈజీగా మిగులుతుంది. ఈ పాలతో నెయ్యి, పన్నీర్, పెరుగు వంటి పాల ఉత్పత్తులను తయారు చేస్తే.. మరింత అధిక ఆదాయం వస్తుంది. ఇంట్రస్ట్‌ ఉంటే..కాస్త రీసర్చ్‌ చేసి స్టెప్‌ తీసుకోవచ్చు. కాకపోతే.. తొలినాళ్లలో కష్టపడాల్సి ఉంటుంది. లాభం బాగా వస్తుంటే.. పనివాళ్లను నియమించుకోవచ్చు.!

Read more RELATED
Recommended to you

Latest news