ఈవిడ కేవలం సర్పంచ్ మాత్రమే కాదు.. ఆ ఊళ్ళో ఓ ఆడపులి. ఆ ఊళ్ళో తప్పులు జరిగినా అన్యాయాలు జరిగినా అస్సలు సహించదు. తప్పు చేస్తే శిక్ష తప్పదు అంటుంది మనీషా కేద్కర్. ఇక ఇదే నేపద్యంలో ఈవిడ తమ గ్రామంలోని ఓ మద్యం వ్యాపారిని కర్రతో తరిమికొట్టిన వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతుంది.
వివరాల్లోకి వెళితే.. మనీషా కేద్కర్ మహారాష్ట్రలోని సిర్పూర్ తాలూకా పింప్రి డుమారా అనే గ్రామానికి సర్పంచ్ గా భాద్యతలు నిర్వహిస్తుంది. కరోనా విజృంభిస్తున్న నేపద్యంలో తమ గ్రామంలో మద్యం అమ్మకాలు చేయవద్దంటున్నా, వినకుండా విక్రయాలు సాగిస్తున్నారు కొందరు వ్యాపారులు. ఈ విషయం తెలుసుకున్న సుదురు సర్పంచ్ వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. మద్యం విక్రయిస్తున్న వ్యాపారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కర్రతో చితకబాదింది. తమ గ్రామం నుండి ఆ వ్యాపారిని తరిమికొట్టింది. వ్యాపృకి బుద్ధి చెబుతున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది. నెటిజన్లు ఆమెని ఆడపులి అని ఆమె చేసిన పని అద్భుతం అని ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.