ఎస్‌ఎస్‌ఎంబీ29 నుంచి క్రేజీ న్యూస్‌….

-

త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వం లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటించిన తాజా చిత్రం గుంటూరు కారం .ఈ సినిమా సంక్రాంతి కానుక గా జనవరి 12 న విడుదల అయింది. మిక్స్‌డ్‌ టాక్ వచ్చిన వసూళ్లు పరంగా ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మహేశ్‌ బాబు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 తో బిజీ అవనున్నట్లు తెలుస్తుంది..ఎస్‌ఎస్‌ఎంబీ 29 కు సంబంధించి డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఉగాది నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానున్నట్లు సమాచారం.

అంతేకాదు ఎస్‌ఎస్‌ఎంబీ 29 స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశానని రైటర్ విజయేంద్రప్రసాద్‌ ఇదివరకే హింట్‌ కూడా ఇచ్చేశారు. ఈ సినిమానీ 2026 ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని సమాచారం. ఈ చిత్రంలో హిందీ యాక్టర్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్‌ యాక్టర్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news