సాధారణంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడూ నీట్ షేవ్ తో డీసెంట్ లుక్ లోనే కనిపిస్తూ ఉంటారు. హెయిర్ స్టైల్ ఎప్పుడూ సింపుల్ గా ఉంటుంది. మీసాలు, గడ్డం కూడా పెంచుకోరు. అలాంటీ లీడర్ ఇప్పుడు మాస్ లుక్ కనిపించాడు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండలా కేటీఆర్ కనిపిస్తే.. ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి క్లాస్ లుక్ నుంచి మాస్ లుక్ కి మారాడు కేటీఆర్. ఈ చిత్రాన్ని మీరు కూడా వీక్షించండి.
ఇటీవలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం చాలా ఎక్కువ అయింది. ప్రతీ రంగంలో కూడా మార్పులు జరుగుతున్నాయి. ఏఐ సాయంతో ఇష్టమైన నాయకుల ఫొటోలు, వీడియోలు ఎడిట్ చేసి వారిని కొత్త లుక్స్ తో పరిచయం చేస్తున్నారు. తాజాగా కేటీఆర్ అభిమాని.. ఏఐ టెక్నాలజీ ద్వారా కొత్త లుక్ లో ఓ ఫొటోను రూపొందించారు. పొడవాటి జుట్టు, గడ్డం, మీసంతో ఎడిట్ చేసి కేటీఆర్ కి పంపించాడు. ఈ ఫొటో కేటీఆర్ కి బాగా నచ్చడంతో దానిని అధికారిక ట్విట్టర్ లో షేర్ చేశాడు. బీఆర్ఎస్ ని అమితంగా ప్రేమించే ఓ వీరాభిమాని ఎడిట్ చేసి పంపిన నా ఫొటోను ట్వీట్ చేస్తున్నా అనే క్యాప్షన్ తో షేర్ చేశారు కేటీఆర్. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.