ఏపీలో ‘రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌’ ఏర్పాటు!

-


కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు వ్యవహారంలో తీవ్ర జాప్యం చేస్తున్నందున ఏపీ మంత్రి వర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.18,000 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వమే ‘రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌’ పేరిట కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఏపీ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా …నెల రోజుల్లోపు కడప స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు.ఉక్కు పరిశ్రమకు సీఎండీగా స్టీల్ ప్లాంట్ మాజీ సీఎండీ మధుసూదనరావుని నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున స్టీల్ ప్లాంట్‌లో కేంద్రం కూడా వాటాదారుగా చేరాలని ప్రధానికి లేఖ రాయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కొన్ని కీలక నిర్ణయాలు…
విశాఖ జిల్లా ల్యాండ్ రికార్డుల ట్యాంపరింగ్‌పై సిట్ దర్యాప్తు నివేదికకు ఆమోదం. సిట్ సిఫార్సుల సాధ్యాసాధ్యాలపై దర్యాప్తుకు కమిటీ ఏర్పాటు.. కమిటీలో రెవెన్యూ, న్యాయశాఖల కార్యదర్శులతో పాటు రాజకీయ నేతలు, అధికారులకు చోటు.
నెల రోజుల్లోగా కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.
విభజన హామీలపై మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయం.
అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం. కొత్తగా మున్సిపల్‌ ప్రాంతాల్లో 125, గ్రామీణ ప్రాంతాల్లో 152 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 44 క్యాంటీన్ల ఏర్పాటుకు నిర్ణయం.
అగ్రిగోల్డ్ బాధితులు 6 రాష్ట్రాల్లో ఉండటంతో.. కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తే 25 శాతం రాష్ట్రం నుంచి చేద్దామని చర్చించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news