శివ దర్శకత్వంలో హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం కంగువ.స్టార్ హీరో సూర్య టైటిల్ రోల్‌లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ . ఈ మూవీ సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన కంగువ పోస్టర్లు, గ్లింప్స్ వీడియోకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇటీవలే మేకర్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ షేర్ చేసిన కొత్త లుక్‌లో సూర్య చేతికి టాటూస్ కనిపిస్తున్నాయి.
సూర్య మరోవైపు సెకండ్ లుక్‌లో ఓ వైపు వారియర్‌గా కత్తి పట్టుకుని కనిపిస్తుండగా.. మరోవైపు స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో దిశ పటాన్ని హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవలే యానిమల్ చిత్రంలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించిన బాబీడియోల్ ఈ సినిమా లో కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. తాజాగా అదిరిపోయే అప్‌డేట్ అందించారు. కంగువలో కీ రోల్ ఉదిరన్ ను పరిచయం చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించారు. రక్తంతో ఉన్న చేతి లుక్‌ను విడుదల చేస్తూ.. థ్రిల్లింగ్ లుక్ రేపు ఉదయం 11 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేశారు. ఈ మూవీ 3d ఫార్మాట్లో సందడి చేయనుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.