కర్నాటకలో నిరుద్యోగులకు భృతి

-

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 5 గ్యారంటీల్లో భాగమైన ‘యువ నిధి’ స్కీమును కర్నాటక రాష్ట్ర గవర్నమెంట్ ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద డిప్లమా ,డిగ్రీ చేసిన నిరుద్యోగులకు స్టైఫండ్ ఇవ్వనుంది. డిప్లమా చేసినోళ్లకు రూ.1,500,డిగ్రీ చేసినోళ్లకు నెలకు రూ.3 వేలు ఇస్తుంది. ఈ స్కీము భాగంగా శివమొగ్గలో సీఎం సిద్ధరామయ్య అర్హులైన ఆరుగురు నిరుద్యోగులకు శుక్రవారం స్టైఫండ్ చెక్కులను అందజేశారు.

 

ఈ పథకం అమలు కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్లు కేటాయించి వచ్చే సంవత్సరం రూ.1,200 కోట్లకు పెరుగుతుందని.. 2026 నుంచి ఏటా రూ.1,500 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని ప్రభుత్వము అంచనా వేసింది. కాగా, 2022-23 అకడమిక్ సంవత్సరంలో పాస్ అయి, జాబ్ దొరకనోళ్లు ఈ పథకానికి అర్హులు. వీళ్లకు రెండేండ్ల పాటు స్టైఫండ్ ఇస్తారు. ఒకవేళ ఈ పీరియడ్ లో జాబ్ వస్తే స్టైఫండ్ నిలిపివేస్తారు.

పైచదువులు చదువుకునే వారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు అని . తాము ఇప్పటికే ప్రారంభించిన గృహలక్ష్మి, గృహజ్యోతి,శక్తి, అన్న భాగ్య గ్యారంటీల కింద 1.5 కోట్ల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news