కాంగ్రెస్ లో చేరనున్న విక్రమ్ గౌడ్ !

-

ముఖేష్ గౌడ్… పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా అందరికీ సుపరిచితమే.ఏమి ఆశించకుండా బీజేపీ కోసం విక్రమ్ గౌడ్ పనిచేశారు. తనకు సరైన గుర్తింపు లభించలేదనే కారణంగానే బీజేపీకి రాజీనామా చేశారు విక్రమ్ గౌడ్. ఇదిలా ఉండగా…. విక్రమ గౌడ్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.

Former minister Mukesh Goud’s son Vikram Goud has resigned from BJP

విక్రమ్ గౌడ్ తన సొంతగూడు అయిన కాంగ్రెస్ లోకి పిసిసి అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరబోతున్నారు.తెలంగాణలో బీసీ నేతగా సుదీర్ఘకాలం పాటు నాయకుడిగా ఉన్న ముఖేష్ గౌడ్ గారి కుమారుడు విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరడం ఒకసారిగా బీసీల నుంచి సపోర్ట్ బాగా పెరిగిపోయినట్లుగా అర్థమవుతుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం విక్రమ్ గౌడ్ గారికి కూడా ఉన్నదని తెలుస్తోంది. బలమైన సామాజిక వర్గం కావడం…ఆర్థికంగానూ, బలంగాను ఉండటం వల్ల ముఖేష్ గౌడ్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశం కచ్చితంగా కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news