కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ కేసు

-

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది . జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవేందర్ నగర్ కట్టమైసమ్మ బస్తీకి చెందిన రమేష్ నాయక్ ఫిర్యాదు మేరకు రెండు రోజుల కిందట కేసు రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. బస్తీలోని అందరి ముందు కూన శ్రీశైలం గౌడ్ తనను దూషించడమే కాకుండా కులం పేరుతో అవమాన పరిచాడని రమేష్ నాయక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఇంత వరకు శ్రీశైలం గౌడ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులపై ప్రతీ రోజు ఓ కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news