దేశంలో వివిధ ప్రాంతాల్లోని కాలుష్యమయమైన నగరాల్లో పర్యావరణానికి హాని కలిగించని టపాసులనే వాడాలని మరోసారి సుప్రీం తేల్చిచెప్పింది. ఈ విషయమై బాణాసంచా తయారీదారులకు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించడానికి సుప్రీం నిరాకరించింది. తీర్పు కంటే ముందుగానే తయారు చేసిన కాలుష్యకారకమైన బాణాసంచాలను అమ్మరాదని నిషేధం విధించిన కోర్టు, కొంత సడలింపు కలిగించి వాటిని ఢిల్లీ వెలుపల విక్రయించవచ్చునని స్పష్టం చేసింది. తక్కువ శబ్దాలు, ఉద్గారాలు వెలువడే పర్యావరణానికి హానికలిగించని టపాసులకు విక్రయించడానికి గత నెల 23న సుప్రీంకోర్టు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. కాలుష్య నగరాల్లో ఢిల్లీ ముందంజలో ఉండటం కారణంగా దేశ రాజధాని నగరం నుంచే మార్పుని సుప్రీం ఆశించింది.