ఏజెన్సీ ప్రాంతంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి దోపిడీ కార్యకలాపాలు చేయడం వల్లనే వారిని కాల్చిచంపామని మావోయిస్టులు వెల్లడించారు. ఈ మేరకు ఏవోబీ ప్రతినిధి జగబందు పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.‘ఏజెన్సీలో లేటరైట్, గ్రానైట్, రంగురాళ్ల క్వారీలు కిడారి నిర్వహిస్తున్నారు. వాటిని నిలిపివేయాలని స్థానికులు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తుంటే వారిపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోంది. ఈ అణచివేతకు ప్రతీకారణంగానే కిడారి, సోమలపై చర్యలు తీసుకున్నాం’ అని జగబందు ఆ లేఖలో పేర్కొన్నారు.మైనింగ్ ని వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు బానాయించి ఇబ్బందులు పెట్టారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ తో కలిసి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించారని పేర్కొన్నారు. ఎన్నిసార్లు వారించిన వినలేదని అందుకే కిడారి, సోమలను హతమార్చినట్లు వివరించారు.