
తెలంగాణలో గులాబీ ప్రభంజనంపై సీఎం కేసీఆర్ కి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తెలంగాణలో గెలుపొందిన శాసనసభ్యులందరికీ అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిపారు.