పశ్చిమగోదావరి జిల్లాలో హైకోర్టు తీర్పుని సైతం లెక్కచేయకుండా కోడిపందేలు నిర్వహించడంపై తహసీల్దార్లకు నూతన సీఎస్ పేరిట షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. గత సంక్రాంతికి జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు నిర్వహించడంపై సీఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పందేల నిర్వాహణపై పది రోజుల్లో పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలంటూ తహసీల్దార్లను ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహించడం ఏ మాత్రం తగదంటూ పునిత నోటీసులో పేర్కొన్నారు. ఏపీలో ప్రధాన్యత సంతరించుకున్న కోడిపందేలపై సీఎస్ పదవిలో చేరిన తొలి రోజే ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.