చైనాలో భారీ అగ్ని ప్రమాదం 13 మంది మృతి…

-

చైనాలో హెనాన్ ప్రావీన్సులోని యన్‌షాన్‌పు గ్రామంలోని యింగ్‌కాయ్ పాఠశాల వసతి గృహంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో 13 మంది చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని హాస్పటల్ కి తరలించారు.ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.ఇటీవల చైనాలో ఫైర్ యాక్సిడెంట్స్ సర్వసాధారణమయ్యాయి.

చైనాలో ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. మృతుల్లోఎందరు పిల్లలు ఉన్నారో అధికారులు ప్రకటించలేదు. పాఠశాల యాజమాన్యానికి చెందిన ఆరుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాయువ్య చైనాలోనీ బార్బెక్యూ రెస్టారెంట్ లో భారీ పేలుడు సంభవించి 31 మంది చనిపోయారు.అంతేకాకుండా బీజింగ్ లోనీ ఒక హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగి 29 మంది చనిపోయారు. గత సంవత్సరం నవంబర్ లో ఉత్తర చైనాలోనీ షాంగ్సీ ప్రావిన్స్‌లోని బొగ్గు కంపెనీ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 26 మంది మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news