జల వివాదం : ఏపీ, తెలంగాణలకు కేఆర్‌ఎంబీ లేఖ…

-

అమరావతి : జల వివాదంపై ఎట్టకేలకు కేఆర్‌ఎంబీ స్పందించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు నేపథ్యంలో తదుపరి చర్యలకు దిగిన కేఆర్‌ఎంబీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి ని వెంటనే నిలిపేయాలని సూచిస్తూ… తెలంగాణ జెన్ కోకు లేఖ రాసింది.

సాగు, తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసినప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేయాలని స్పష్టం చేసింది కేఆర్‌ఎంబీ. ఇక అటు ఏపీకి కూడా లేఖ రాసిన కేఆర్‌ఎంబీ… ఆర్డీఎస్‌ కుడికాల్వ పనులు చేపట్టవద్దని కేఆర్‌ఎంబీ కార్యదర్శ హరికేష్‌ మీనా… ఏపీ ఈఎన్సీని ఆదేశించారు.

బోర్డుకు డీపీఆర్‌ ఇవ్వకుండా…. ఆమోదం పొందకుండా పనులు చేయొద్దని ఆదేశారు జారీ చేశారు. ఇది ఇలా ఉండగా… కృష్ణా, గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధి పై రేపు గెజిట్ విడుదల కానుంది. నది యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల చేయనుంది కేంద్రం. రేపు మధ్యాహ్నం 1:30కి గెజిట్లు విడుదల చేయనున్నారు కేంద్ర జలశక్తి శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news