ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కాం తో తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే పలుమార్లు ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ మధ్యాహ్నం కవితకు ఈడీ నోటీసులను ఇచ్చింది.. కాగా ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. భారతదేశంలో ఉన్న చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు అంటూ కవితపై కామెంట్స్ చేశారు ఈటల రాజేందర్. ఈ కేసును ముందస్తుగా మానేజ్ చేసే ప్రయత్నం చేశారు, అంతే కాకుండా అధికారులను సైతం తప్పుదోవ పట్టించడానికి చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు అంటూ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే… శిక్ష అనుభవించక తప్పదు అంటూ ఈటల చెప్పారు.
కాగా ఈ రోజు కవితకు నోటీసులు అందగా, ఆమె రేపు విచారణకు హాజరు కావాల్సింది పోయి మా లీగల్ టీం తో చర్చించి నిర్ణయం చెబుతాము అని సమాధానం ఇచ్చింది.