తన పెళ్లి పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన గోవా బ్యూటీ….

-

టాలీవుడ్ బ్యూటీ ఇలియానా పరిచయం అక్కర్లేని పేరు.

టాలీవుడ్ లో వరుస హిట్లతో సక్సెస్ లను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళింది. కానీ అక్కడ అనుకున్నంత గుర్తింపు మాత్రం సాధించలేకపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ తగ్గిపోవడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. గ తేడాది ఆగస్టు 1న పెళ్లి చేసుకోకుండానే బిడ్డని జన్మనిచ్చి వార్తలు నిలిచింది. అయితే ఆ తర్వాత ఈ బ్యూటీ తన పార్ట్నర్ను పెళ్లి చేసుకుందా లేదా అనేది ఇంకా తెలియదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా తన పెళ్లికి సంబంధించిన విషయాలను సీక్రెట్ గా ఉంచాలని తెలిపింది.

ప్రస్తుతం ఈ భామ తన పార్ట్నర్ ,తన కొడుకుతో కలిసి అమెరికాలో ఉంటుంది. అయితే తను బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని నెలల ముందే తనకు పెళ్లి అయినట్టు వార్తలు వినిపించాయి. దీనిపై వచ్చిన పుకార్లను తాను అంత పెద్దగా పట్టించుకోనని పేర్కొంది. నా రిలేషన్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్న కూడా నేను వాటికి అంతగా స్పందించను ఒకవేళ నా ఫ్యామిలీ గురించి మాత్రం వాళ్లు ఏమైనా పుకార్లు సృష్టిస్తే తనకు అంత బాగా అనిపించదని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. అయితే ఇదే ఇంటర్వ్యూలో ఆడవాళ్లు తల్లి అయిన తర్వాత కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు కదా మరి మీకు ఏదైనా సమస్యలు వచ్చాయా అని అడగగా దానికి బదులిస్తూ ఇలియానా తన పార్ట్నర్ ఆ సమయంలో తనకు తోడుగా నిలిచాడని ఆమె తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news