Telangana : లక్షల కోట్లు అప్పులు ఎలా తీర్చాలో తెలియక మా మంత్రులు తలలు పట్టుకున్నారు…..

-

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీఆర్ఎస్ నేతలు ,వారి పాలనపై ఆయన విరుచుకుపడ్డారు. సెక్రటేరియట్లో తొమ్మిది సంవత్సరాలుగా ఉంటున్న ఫైళ్ళ బూజు మా మంత్రులు దులుపుతున్నారని మంత్రి జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రుణ మాఫీ పై మాట్లాడే హక్కు హరీష్ రావుకి ,కేటీఆర్ కు లేదని ఆయన అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసినదని వాటిని ఎలా నేలవేర్చాలో తెలియక మా మంత్రులు తలలు పట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణ ప్రజలు వారిని అప్పు చేయమని అడగలేదని జగ్గారెడ్డి అన్నారు.

కేబుల్ బ్రిడ్జి కట్టిన మీరు ఇంత చెప్పుకుంటుంటే.. పీవీ ఎక్స్ ప్రెస్ వే, ఓఆర్ఆర్,ఎయిర్ పోర్ట్ సృష్టికర్త వైఎస్ఆర్ ఇంకెంత చెప్పుకోవాల్సి ఉండే అని జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చి తప్పినందుకు కోర్టులో కేసు వేస్తామన్నారు జగ్గారెడ్డి. కెసిఆర్ కుటుంబం 420 కుటుంబం కాబట్టి ప్రజలు వారిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారని అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ కోసం 840 చట్టం తీసుకురావాలి ఏమో అని ఎద్దేవా చేశారు. బెంజ్ కార్లలో తిరిగే కేటీఆర్ ,హరీష్ రావు లకి బస్సు ప్రయాణం గురించి తెలియదని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news