తలాక్.. తలాక్.. తలాక్.. అమ్మాయి పుట్టిందని భార్యకు ఫోన్ లోనే చెప్పేశాడు..!

-

తలాక్.. తలాక్.. తలాక్.. దాన్నే త్రిపుల్ తలాక్ అని కూడా అంటాం. ఇది ఇప్పుడుచట్ట విరుద్ధం కానీ.. దీన్ని ఎలా మిస్ యూజ్ చేస్తున్నారో చూడండి. ఓ వ్యక్తి ఉత్తిపుణ్యానికే తన భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పాడు. తన భార్య ఆడపిల్లకుజన్మనిచ్చిందని ఫోన్ లోనే తలాక్.. తలాక్.. తలాక్ చెప్పేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోనిటోలిచౌకీలో చోటు చేసుకున్నది.

ముజమ్మిల్ అనే వ్యక్తి గత సంవత్సరం ఓ యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఆ యువతి మూడు నెలల కింద ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడబిడ్డకు జన్మనిస్తావా అంటూ ముజమ్మిల్ ఆమెను వేధిస్తున్నాడు. కొన్నిరోజుల కింద తన భార్యకు ఫోన్ చేసి తలాక్ చెప్పి పెట్టేశాడు. అతడి మాటలకు షాక్ అయిన ఆ యువతి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version