తుది శ్వాస విడిచిన సీనినటుడు వైజాగ్ ప్రసాద్

-

వెండితెర సీనియర్‌ నటుడు వైజాగ్‌ ప్రసాద్‌(75) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.  కళా రంగంలో వైజాగ్‌ ప్రసాద్‌గా స్థిరపడిన ఆయన స్వస్థలం విశాఖపట్నంలోని గోపాలపురం. అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. ఆయనకు కుమార్తె రత్నప్రభ, కుమారుడు రత్నకుమార్‌ ఉన్నారు.  సుమారు 700 నాటికల్లో నటించిన ఆయన 1983లో బాబాయ్‌ అబ్బాయ్‌ సినిమా ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. నువ్వు నేను, భద్ర, జై చిరంజీవ, నీరాజనం, జెమిని, అల్లరి బుల్లోడు, సుందరకాండ, రాణిగారి బంగ్లా తదితర చిత్రాల్లో ఆయన నటించారు. ఆయ‌న మృతి సినీ ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు.. ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని, వారి కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతి తెలియ‌జేస్తున్నారు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news