తెలంగాణలో మరోసారి ఎన్నికలు..!

-


తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వాహణపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తేనే తాము ఎన్నికలు నిర్వహించగలమని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు వివరించింది. దీంతో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపింది. ఇరు వైపుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. అయితే పంచాయతీ ఎన్నికల నిర్వాహణపై… జనవరి 10లోగా ఎన్నికలు నిర్వహించాలని ఇది వరకే హైకోర్టు స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల కేటాయింపు గరిష్ఠంగా 50 శాతానికి మించడానికి వీల్లేదని ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని ఇటీవలే సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. దీంతో హైకోర్టులో తాజా విచారణతో మరో నెలరోజుల్లోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇక రెండు మూడు నెలల వరకు ఎన్నికల వాతావరణం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news