త్వరలో కేటీఆర్ బాగోతం బయటకు వస్తుంది :ఎంపీ అర్వింద్

-

తెలంగాణాలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే దేశంలో జరుగుతున్న అవినీతికి సీఎం కేసీఆర్‌కు ప్రమేయం ఉందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. దిల్లీలో ఆప్‌ భ్రష్టు పట్టడంలో కేసీఆర్ హస్తం ఉందని పేర్కొన్నారు ఎంపీ అర్వింద్‌. కవిత.. దిల్లీలో లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశాలు నిర్వహించిందని ఎంపీ అర్వింద్‌ వెల్లడించారు. పంజాబ్ రైతుల పేరుతో కేసీఆర్ పర్యటనలు చేశారని తెలిపారు. ఫీనిక్స్‌పైన సీబీఐ దాడులు జరుగుతున్నాయన్నారు ఎంపీ అర్వింద్‌. త్వరలో కేటీఆర్ బాగోతం కూడా బయటకు వస్తుందని అభిప్రాయపడ్డారు ఎంపీ అర్వింద్‌.

Special court issues non bailable warrant against BJP MP Aravind

దేశంలో జరుగుతున్న అత్యంత అవినీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం ఉందని, ఎమ్మెల్సీ కవిత దిల్లీలో లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశాలు నిర్వహించిందన్నారు ఎంపీ అర్వింద్‌. అవినీతిలో పూర్తిగా కూరుకుపోయింది కవిత అని, పంజాబ్ రైతుల పేరుతో కేసీఆర్ పర్యటనలు చేశారన్నారు ఎంపీ అర్వింద్‌. కవిత విషయంలో కేటీఆర్ ఏమీ మాట్లాడుతలేరని, ఫీనిక్స్ పైన సీబీఐ దాడులు జరుగుతున్నాయన్నారు ఎంపీ అర్వింద్‌. కేటీఆర్ బాగోతం కూడా బయటకు వస్తుందని, ముఖ్యమంత్రి కుటుంబం మొత్తం ఈడీ, సీబీఐలో ఇరుక్కుపోయారన్నారు ఎంపీ అర్వింద్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news