నగరంలో ట్రాఫిక్ ఆంక్షల వివరాలు

-

 

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న సందర్భంగా నగరంలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ ప్రకటించారు.

బుధవారం ఉదయం 8.45 నుంచి 9.35 గంటల వరకు రోడ్‌ నెంబర్‌ 12, ఏసీబీ ఆఫీస్‌, రోడ్‌ నెం. 1/12 జంక్షన్‌,, తాజ్‌ కృష్ణాహోటల్‌, వివి విగ్రహం, షాదాన్‌ కాలేజ్‌ యూ టర్న్‌, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ వరకు. ఉదయం 10.15 నుంచి 11.05 గంటల వరకు వివి విగ్రహం, వెంగళరావు బస్టాప్‌, తాజ్‌కృష్ణా జంక్షన్‌, కేర్‌ ఆస్పత్రి రోడ్‌,  రోడ్‌ నెం. 12. బంజారాహిల్స్‌ వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయి. సాయంత్రం 4.15 నుంచి 6.35 వరకు  ఒడిశా ఐలాండ్‌, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, పెద్దమ్మ టెంపుల్‌ జంక్షన్‌, క్రోమా బిల్డింగ్‌, నీరూస్‌ జంక్షన్‌, శిల్పకళావేదిక  మార్గాల్లో  ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.

గురువారం ఉదయం 9.20 నుంచి మధ్యాహ్నం గంటల వరకు రోడ్‌ నెం.12 బంజారాహిల్స్‌ నుంచి ఏసీబీ ఆఫీస్‌ జంక్షన్‌, మాసాబ్‌ట్యాంక్‌, పీటీఐ బిల్డింగ్‌, లక్డీకపూల్‌, రవీంద్రభారతి, ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూం, బీజేఆర్‌ విగ్రహం, గన్‌ఫౌండ్రీ, , డీఎంహెచ్‌ఎస్‌ జంక్షన్‌, కోఠి వుమెన్స్‌ కాలేజీ, ఆంధ్రాబ్యాంక్‌, పుత్లీబౌలీ క్రాస్‌రోడ్స్‌, ఎంజె మార్కెట్‌, జీపీఓ, నాంపల్లి టి.జంక్షన్‌, చాపెల్‌రోడ్‌, అసెంబ్లీ, రవీంద్రభారతి జంక్షన్‌, లక్డీకపూల్‌ న్యూ బ్రిడ్జి, పీటీఐ బిల్డింగ్‌, మాసాబ్‌ట్యాంక్‌, సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌ ఆఫీస్‌ మార్గాల్లో విధించామన్నారు. కార్లు, బైకులపై ప్రయాణించే వారు ఈ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సీపీ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version