నా వెంట్రుక ముక్క కూడా చంద్రబాబు పీకలేరు- కొడాలి నాని

-

ఈరోజు స్వర్గీయ నందమూరి ఎన్టీయార్ వర్ధంతి. ఈసందర్భంగా గుడివాడలో టీడీపీ అధ్వర్యంలో నిర్వహించిన రా కదిలి రా కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఎన్టీయార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.గుడివాడలో టీడీపీ వర్దంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కామెంట్స్ కు కొడాలి నాని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు గుడివాడ అభివృద్ధి కోసం ఏం చేశారు అని ప్రశ్నించారు. మంచి నీటి అవసరాల కోసం 216 ఎకరాల్లో చెరువుల కోసం ఏర్పాటు చేశామని ,చంద్రబాబు ఒక్క ఎకరా సేకరించారని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా.. నా సవాల్ స్వీకరించగలరా? అని ఆయన అన్నారు. నేను గంజాయి మొక్కని కాను.. గుడివాడ ముద్దు బిడ్డని.. టీడీపీ తులసీవనంలో చంద్రబాబే గంజాయి మొక్క అని అన్నారు.

చంద్రబాబు ఉడత ఊపులకు భయపడను అని,నా వెంట్రుక ముక్క కూడా చంద్రబాబు పీకలేరు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. శత్రువుకు కూడా లోకేష్ లాంటి కొడుకు పుట్టకూడదు.. చంద్రబాబుకు ఏం కోటాలో పదవి వచ్చింది.. నీతుల కోటాలోనా..? వెన్నుపోటు కోటానా..? కోతల కోటాలోనా..?అని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news