నేటి నుంచి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాల‌కృష్ణ!

-

తెలంగాణలో తెదేపా తరఫున ఎన్నికల ప్రచారానికి నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణను తెదేపా ఉపయోగించనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి  ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారానికి బాలయ్య  శ్రీ‌కారం చుట్ట‌నున్నారు.   ఉమ్మడి ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి తెదేపా అభ్య‌ర్థి సండ్ర వెంక‌ట వీర‌య్య‌ను గెలిపించాల్సిందిగా బాల‌కృష్ణ కోరనున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయా నియోజకవర్గాల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వ‌హించ‌టంతో పాటు బ‌హిరంగ స‌భ‌ల్లో ఆయన పాల్గొంటారని స్థానిక తెదేపా నేతలు వివరించారు.

తన  తండ్రి ఎన్టీఆర్ నాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెదేపాను స్థాపించిన విషయం తెలిసిందే.. అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ -తెదేపా పొత్తు పెట్టుకున్న సందర్భంగా ఆయన ఏ విధంగా స్పందిస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news