భారతదేశ అత్యున్నత న్యాయస్థానం 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయ్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జస్టిస్ గొగొయ్ చేత ప్రమాణం చేయిస్తారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపడుతున్న తొలివ్యక్తిగా గొగొయ్ అరుదైన రికార్డ్ సాధించారు. నేటి నుంచి దాదాపు పదమూడున్నర నెలల పాటు సీజేఐగా ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు.
న్యాయపరమైన అంశాలు, కీలకమైన విషయాల్లో దృఢంగా వ్యవహరించడంతో పాటు తన అభిప్రాయాలను సూటిగా వెల్లడిస్తారనే పేరుంది. జస్టిస్ గొగొయ్ ఎదుట ఉన్న కీలకమైన అయోధ్య, ఎన్ఆర్సీ, కళాంకితులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, లోక్ పాల్ కేసుల్లో ఎలాంటి తీర్పుని వెలువరిస్తారనే ఆసక్తినెలకొంది.