వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ లో విడుదల కాబోయే సినిమాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ సంక్రాంతికి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్, వెంకటేష్ యొక్క సైందవ్ ,నాగార్జున నటించిన నా సామి రంగ, మాస్ మహారాజా రవితేజ యొక్క సినిమాలతో పాటు తమిళ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలాం అతని అల్లుడు నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ సినిమాలకి తమిళము తో పాటు టాలీవుడ్ లోనూ మంచి హైప్ ఉంది.
ఇందులో ఏ సినిమా వస్తుందో రాదో అనేది పక్కన పెడితే … జనవరి 12వ తేదీన విడుదలవుతున్న మహేష్ బాబు గుంటూరు కారం తో దర్శకుడు ప్రశాంత్ వర్మ తీస్తున్నటువంటి హనుమాన్ సినిమా మధ్య క్లాష్ గురించి ప్రశాంత్ వర్మ స్పందించాడు.
ఈరోజు హనుమాన్ ట్రైలర్ విడుదల సందర్భంగా మాట్లాడుతూ…. మేము ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ ని చాలా రోజుల క్రితం ప్రకటించామని తెలిపాడు అలాగే మేము సినిమా విడుదల తేదీని ప్రకటించిన చాలా రోజుల తర్వాత గుంటూరు కారం టీం వారి యొక్క సినిమా విడుదల తేదీని ప్రకటించారని అన్నాడు. నేను కూడా మహేష్ బాబు గారికి పెద్ద ఫ్యాన్ అని హనుమాన్ సినిమాతో పాటు గుంటూరు కారం సినిమా చూస్తానని చెప్పాడు. ఇప్పటికే సినిమా యొక్క అగ్రిమెంట్స్ పూర్తి అవడం వల్ల క్లాష్ తప్పడం లేదని స్పష్టం చేశారు.