హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ని కేంద్ర మంత్రి హన్సరాజ్ మంగళవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీకుమార్ స్వాగతం పలికారు. దేశంలో రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా పంజాగుట్ట పీఎస్ ఎంపికైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పీఎస్ పరిధిలోని టెక్నాలజీ, అందిస్తున్న రక్షణ సదుపాయాలను చూసి కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ తరహా టెక్నాలజీని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్టేషన్లలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. తెలంగాణలో అనుసరిస్తున్న పోలీస్ విధానాల వల్ల గత నాలుగేళ్లలో క్రైమ్ రేట్ 40 శాతం, చైన్ స్నాచింగ్ 98 శాతం తగ్గిందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.