శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందకు భాజపా అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. తెలంగాణ భాజపా నుంచి సీఎం అభ్యర్థిగా పరిపూర్ణానందను బరిలోకి దింపనున్నట్లు సర్వత్రా చర్చనీయాంశమైంది. మరో యోగి ఆదిత్యనాథ్ తరహాలో తెలంగాణలోనూ అధికారం చేపట్టాలనే లక్ష్యంతో భాజపా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. పరిపూర్ణానందను సీఎంగానైనా లేదా హైదరాబాద్ ఎంపీగానైనా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తన రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయాన్ని అమ్మవారికే వదిలేశానని… భాజపా, తెరాసలో ఏది ముందు ఆహ్వానిస్తే అందులో చేరి దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.