యువతిని పొట్టన పెట్టుకున్న గాలిపటం దారం..!

-

గాలిపటం.. సంక్రాంతికి మన దగ్గర ఫుల్లుగా ఎగిరేస్తుంటారు. అప్పుడప్పుడు కొన్ని ఏరియాల్లో ఎగిరేస్తుంటారు. పిల్లలు కూడా సరదాగా ఎగిరేస్తుంటారు. కానీ.. పిల్లల సరదా కాస్త విషాదంగా మారిపోయింది. పిల్లలు ఎగిరేసిన గాలిపటం మాంజా ఓ నిండు ప్రాణాన్ని బలగొన్నది. ఈ ఘటన పూణెలో చోటు చేసుకున్నది.

పూణేలోని పింపల్ ప్రాంతంలో డాక్టర్ గా పనిచేస్తున్న 26 ఏళ్ల యువతి క్రుపాలీ నికమ్.. తన స్కూటీపై వెళ్తోంది. భోసరీ ప్రాంతంలో ఫాటా బ్రిడ్జి మీద వెళ్తుండగా.. సడెన్ గా రోడ్డు మీద ఉన్న గాలిపటం దారం దాన్నే మాంజా అని కూడా అంటాం.. అది ఆమె మెడకు చుట్టుకుంది. దీంతో బండి అదుపు తప్పి ఆమె కిందపడింది. అప్పటికే మాంజా ఆమె గొంతును కోసేసింది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. చూశారా.. ఓ మాంజా నిండు ప్రాణాన్ని ఎలా బలిగొన్నదో.

Read more RELATED
Recommended to you

Latest news