పుట్టామధు నుంచి ప్రాణహాని ఉంది… డీజీపీకి ఫిర్యాదు

-

తెరాస మంథని తాజా మాజీ ఎమ్మెల్యే  అభ్యర్థి పుట్ట నుంచి ప్రాణ హాని ఉందంటూ రమణారెడ్డి అనే వ్యక్తి డీజీపీకి ఫిర్యాదు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మధుకు తెరాస టికెట్ దగ్గడం కోసం ఓ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించాడని, ప్రస్తుతం తనను హత్య చేసేందుకు కుట్రపన్నాడని రమణారెడ్డి ఆరోపించారు. ఈ విషయమై తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు. పుట్ట మధు తనను హత్య చేయించాలని యత్నిస్తున్నాడని అందుకు బలమైన కారణం ఉందన్నారు. ఈ మేరకు కొన్ని ఆధారాలను డీజీపీకి అందజేశారు. జూన్ 6, 2013లో కేసీఆర్ పాల్గొన్న సభలో పుట్ట మధుకు తెరాసకు టికెట్ ఇవ్వాలని కోరుతూ నాగరాజు ప్రాణాలొదిలాడు.

 

ఆత్మహత్య చేసుకుంటే రూ.50 వేలు ఇస్తానని, నువ్వు చనిపోతే నీ కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకుంటానని నాగరాజును పుట్ట మధు నమ్మించాడని’ రమణారెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన కాల్‌డేటాతో సహా, చనిపోయిన నాగరాజు ఇచ్చిన వాంగ్మూల ప్రతులను డీజీపీకి రమణారెడ్డి అందజేశారు. నాడు నాగరాజు ఆత్మహత్య కేసులో నాగరాజు ఆత్మహత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నా పోలీసులు పుట్ట మధుపై కేసు నమోదు చేయలేదని, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. కేసులో వాస్తవాలు తెలిసిన నన్ను అడ్డుతప్పించి తాను మరో సారి అధికారంలోకి రావాలని పుట్టమధు వ్యూహరచన చేస్తున్నట్లు రమణారెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news