జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సంతోష్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి గురువారం జిల్లా కేంద్రంలోని దౌదర్‌పల్లి సమీపంలో 300 వందల పడకల ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 300 పడకల దవాఖాన నిర్మాణం పనులు పూర్తయ్యాయని అన్నారు.ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రజలకు మెరుగైన వైద్యం అందచేస్తామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యానికి సంబంధించిన పరికరాలను అందుబాటులో ఉంచి మెరుగైన వైద్య చికిత్సను అందించాలనని అన్నారు.
అనంతరం కలెక్టర్ సంతోష్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్,డీఎంహెచ్‌వో శశికళ,ఆర్.డి.ఓ చంద్రకళ,, తాహసిల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ నరసింహ,నర్శింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కమల, హాస్పిటల్ సూపరింటెండ్ డాక్టర్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.