ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో సంక్రాంతి రోజు 12 తెలుగు సినిమాలు !

-

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సంస్థ సంక్రాంతి నాడు మొత్తం 12 సినిమాలు తమ ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్లుగా ఒక పెద్ద లిస్ట్ రిలీజ్ చేసింది. ఒక్కొక్క చిత్రం గురించి వివరిస్తూ ఒక్కొక్క పోస్ట్ చేసింది.ఇప్పటికే నాని హీరోగా నటించిన హాయ్ నాన్న చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది .రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా తెలుగు,హిందీ, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో స్టీమ్ అవబోతుందని ప్రకటించింది. దీంతో పాటు క్రేజీ ప్రాజెక్టులుగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర,పుష్ప 2 ది రూల్, టిల్లు స్క్వేర్ వంటి చిత్రాలు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయని తెలిపింది. బాలకృష్ణ 19వ సినిమా, విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి , శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ 37వ సినిమాగా తెరకెక్కుతున్న సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయని వెల్లడించింది.

 

అల్లు శిరీష్ హీరోగా నటించిన బుడ్డి సినిమా , కార్తికేయ యూవీ క్రియేషన్స్ సినిమా ,నార్నె నితిన్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలన్నీ థియేటర్లలో సందడి చేసిన తర్వాత తమ నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఆడియన్స్ కి అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news