బెల్ట్ షాపులు మూసివేయాలి.. ఇది మునుగోడు నుంచే మొదలవ్వాలి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

-

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు మండలంలోని 26 గ్రామాల ముఖ్య నాయకులతో గ్రామాల అభివృద్ధి,బెల్ట్ షాపులు మూసివేత పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతు…మద్యానికి బానిసలై చాలా కుటుంబాలు నాశమవుతున్నాయని తెలిపారు.ఎక్కడబడితే అక్కడ మద్యం దొరకడం వల్ల యువత చెడిపోతున్నారని వారి భవిష్యత్తు నాశమవుతోందని అన్నారు.గ్రామాలలో నాయకులు బెల్ట్ షాపుల్ని బంద్ చేయించాలని…బెల్ట్ షాపులు చట్ట ప్రకారం నిషేధమన్నారు.

బెల్ట్ షాపులు క్లోజ్ వేయడం గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని తెలిపారు.ఇది రాజకీయాలతో సంబంధంలేని అంశమని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉండేవి కావని బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే బెల్ట్ షాపులు వచ్చి ఎందరో యువకులు చనిపోయారని విమర్శించారు.మునుగోడు నుంచే బెల్ట్ షాపు ఉద్యమము మొదలు కావాలని అది ఇప్పుడే ప్రారంభమైందని ….. బెల్ట్ షాపుల నిర్మూలన అనేది ఓ ఉద్యమం వలె మారాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ప్రతి గ్రామంలో షాపులు మూసివేయాలని దండోరా వేయించలని అని పిలుపునిచ్చారు.ప్రతి గ్రామంలో పదిమందితో అలాగే ఊరి పొలిమేర లోపల మద్యం గాని గంజాయి గాని లేకుండా చేయడం ఈ కమిటీ బాధ్యత అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news