మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్దకు టాలీవుడ్ ప్రముఖులు…..

-

ఈరోజు పలువురు టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని కలిశారు. బంజారా హిల్స్ లో గల లోటస్పాండ్ లోని నివాసంలో వారు కలిశారు.నిర్మాతలు దిల్ రాజ్, సురేశ్ బాబు, సుధాకర్ రెడ్డి,దర్శకులు రాఘవేందర్ రావుతో పాటు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు,సుధాకర్ రెడ్డి, సి.కల్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ,ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు కోమటిరెడ్డి గారిని కలిశారు.

 

ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఎదురుకుంటున్నటువంటి సమస్యలను గూర్చి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే సరైన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చాడు. అలాగే తాను సినిమా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టాలీవుడ్ ప్రముఖులు ఎవరు తనను అభినందించలేదని అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేవలం నిర్మాత దిల్ రాజ్ మాత్రమే అభినందనలు తెలిపారని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news