మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్

-

మంత్రి కోమటిరెడ్డికి ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకమున్నా జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు.
యాదాద్రి-భువనగిరి జిల్లా జెడ్పీ సమావేశంలో సందీప్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అవమానించడాన్ని హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా ఖండించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో సాటి ప్రజాప్రతినిధులకు ఘోర అవమానం జరుగుతోందని.. మంత్రుల వైఖరి మార్చుకోవాలని సూచించారు.

 


రైతుబంధు రాదన్న వారిని చెప్పుతో కొట్టండని పిలుపునిచ్చిన మంత్రి కోమటిరెడ్డి ,ఈరోజు జెడ్పీ చైర్మన్‌పై అధికారిక కార్యక్రమంలో దుర్భాషలాడటం కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనం అని హరీష్ రావు అన్నారు. మాట్లాడింది చాలదన్నట్టు పోలీసులకు హుకూం జారీ చేసి బలవంతంగా సందీప్ రెడ్డిని బయటకు పంపిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version