టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం కింగ్ విరాట్ కోహ్లీ తన సుదీర్ఘ కెరీర్‌లో మరెవరికీ సాధ్యంకాని రికార్డులు సొంతం చేసుకున్న ఈ రున్ మెషీన్.. అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌లో మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో టీ20లు, లీగ్‌లలో ఆడుతూ అత్యధిక రన్స్ సాధించిన బ్యాటర్లలో ఇండియా నుంచి 12వేల పరుగుల మైలురాయిని అందుకోనున్నారు. మరో 35 రన్స్ చేస్తే కోహ్లీ ఈ ఘనతను సాధిస్తాడు.
35 సంవత్సరాల కింగ్ విరాట్ కోహ్లీ.. టీ20, ఐపీఎల్‌లో కలిపి ఇప్పటివరకూ 374 మ్యాచ్‌లలో 11,965 రన్స్ చేశాడు. ఇండియా నుంచి ఇన్ని రన్స్ చేసిన బ్యాటర్ కూడా కోహ్లీ మాత్రమే . టీ 20 క్రికెట్‌లో అత్యధికంగా రన్స్ చేసిన క్రికెటర్లలో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ (14,562) మొదటి స్థానంలో ఉండగా పాకిస్తాన్ బ్యాటర్ షోయభ్ మాలిక్ (12,993) 2 వ స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ (11,965) థర్డ్ ప్లేస్‌లో ఉండగా విరాట్ కోహ్లీ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాడు.