కేసీఆర్ పవర్ లో కంటే ప్రతిపక్షంలో ఉంటేనే వెరీ డేంజర్.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరిలో ప్రజలకు మధ్య వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్ లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మనం అంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్లమేనని.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మన పోరాట పటిమ చూశారని పేర్కొన్నారు. ఇంకా.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉండటమే వెరీ డేంజర్ అని కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. సీఎం అనే రెండు అక్షరాల కంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలే ఎంతో పవర్ పుల్ అన్నారు. ఎంపీ నియోజకవర్గాల సమీక్షల తరువాత అసెంబ్లీ స్థానాల సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ రెండు మూడు నెలలకొకసారి కమిటీలు అన్ని సమావేశం అవుతాయన్నారు. త్వరలోనే జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటు తప్పకుండా గెలవాలని నేతలకు సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news