మహిళా తహసిల్దార్లు ఇక‌పై ‘పెప్పర్ స్ప్రే’తో…

-

రోజు రోజుకి మహిళలపై దాడులు హత్యలు హత్యచారాలు ఎక్కువవుతున్నాయి. ఇటీవ‌ల‌ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో తహసిల్దార్ విజయ రెడ్డి హత్య తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన‌ విషయం తెలిసిందే. ఓ రైతు లంచం అడిగిందంటూ విజయ రెడ్డి పై పెట్రోల్ పోసి అందరూ చూస్తుండగానే సజీవ దహనం చేశాడు. అయితే మహిళా రెవిన్యూ అధికారులు ఇకపై ‘పెప్పర్ స్ప్రే’తో విధులకు హాజరు కావాలి. అనధికారిక ఆదేశాలివి. అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి హత్యోదంతం తర్వాత… రాష్ట్రంలో పరిస్థితి ఇది.

రాష్ట్రంలో దాదాపు 400 మంది వరకు మహిళా రెవిన్యూ అధికారులు పని చేస్తున్నారు. అయితే రెవిన్యూ సిబ్బంది, అధికారులకు రక్షణ లేకుండా పోయింది. కనీసం మహిళా అధికారులైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల సిరిసిల్లలో కూడా ఓ వ్యక్తి పెట్రోలు డబ్బాతోతహసిల్దారును కలిసేందుకు వచ్చిన విషయం విదితమే. మొత్తంమీద ఈ పరిణామాల క్రమంలో పెప్పర్ స్ప్రేతో విధులకు రావాలంటూ సంఘం నేతలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news